21 న పెన్షన్ మరియు GPF అదాలత్ : ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ (ఏ & ఇ) ఏపీ శాంతి ప్రియ సరేళ్ల
కాకినాడ,ఫిబ్రవరి17,2025 ఏపీ టీచర్స్ టీవీ: PAG (A&E), AP, విజయవాడ వారు 21-02-2025న కాకినాడ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులు/GPF కేసులను సమీక్షించడానికి మరియు పరిష్కరించడానికి , DDOలకు సమర్ధవంతంగా సేవలను అందించడానికి , GPF సమయానికి అందించడానికి "పెన్షన్ మరియు GPF అదాలత్" నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్( ఏ & ఇ) ఆంధ్రప్రదేశ్ శ్రీమతి శాంతి ప్రియ సరేళ్ల ఒక ప్రకటనలో తెలిపారు.
కాకినాడ జిల్లాలోని జిల్లా అధికారులు/డ్రాయింగ్ & పంపిణీ అధికారులందరూ తేదీ 21-02-2025న కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల "విధాన గౌతమి మీటింగ్ హాల్"లో ఉదయం 10.00 గంటలకు నిర్వహించే "పెన్షన్ మరియు GPF అదాలత్ కు పెండింగ్ లో ఉన్న పెన్షన్ కేసులు / GPF సమస్యలు వివరాలతో హాజరు కావాలని ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ (ఏ & ఇ) ఆంధ్రప్రదేశ్ శ్రీమతి శాంతి ప్రియ సరేళ్ల ఒక ప్రకటనలో కోరారు.
ఈ పెన్షన్, జిపిఎఫ్ అదాలత్ లో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్) కిషోర్ రెడ్డి పోలు , డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఎన్ టైటిల్మెంట్స్) లలిత్ కుమార్. వి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (పెన్షన్స్ ) జి. సునీత , సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (పెన్షన్స్) టి. విజయ్ కుమార్ , సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జిపిఎఫ్) డి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొని జిపిఎఫ్ , పెన్షన్ సమస్యలను అక్కడకక్కడే పరిష్కరించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ (ఏ & ఇ) శ్రీమతి శాంతి ప్రియ సరేళ్ల ఆ ప్రకటనలో వివరించారు .
*********""""*********
డి ఐ పి ఆర్ ఓ, కాకినాడ వారి ద్వారా జారీ.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments