top of page

12వ పిఆర్సి ఏదీ?

Writer's picture: AP Teachers TVAP Teachers TV

12వ పిఆర్సి ఏదీ?
12వ పిఆర్సి ఏదీ?

12వ పిఆర్సి ఏదీ?


• యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు


2023 జులై 1 నుంచి రావాల్సిన 12వ పిఆర్సి జాడ ఎక్కడని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బుధవారం యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 11వ పిఆర్సిలో 23 శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం 12 పిఆర్సికి సంబంధించి ఒక్క మాటైనా మాట్లాకపోవడం సరికాదన్నారు.


ప్రతి ఐదేళ్లకోసారి పిఆర్సి కమిషన్ వేసి ద్రవ్యోల్బణం ఆధారంగా ఉద్యోగుల వేతనాలను స్థిరీకరించడం ఉద్యోగుల హక్కు అని, ఆ హక్కును ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 12వ పిఆర్సి చైర్మన న్ను నియమించాలని, రిపోర్టు వచ్చేలోపు ఐఆర్ 30 శాతం ప్రకటించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడి పట్ల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని అన్నారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చిన్నబ్బాయి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కులను నిలబెట్టడం కోసం ఈ నెల 27న జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని కోరారు.

 
 

Recent Posts

See All

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల

కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి...

Commentaires


bottom of page