10, 12 బోర్డు పరీక్షలు ఇక సీసీటీవీ నిఘాలోనే
CBSE: 2025లో జరగనున్న 10, 12 బోర్డు పరీక్షలు సీసీటీవీ నిఘాలోనే నిర్వహించాలని సీబీఎస్‌ఈ బోర్డు నిర్ణయించింది.
CBSE Board Exam 2025 | ఇంటర్నెట్ డెస్క్: రానున్న ఏడాదిలో నిర్వహించబోయే 10, 12 బోర్డు పరీక్షలు సీసీటీవీ నిఘాలోనే జరపాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్ణయించింది. ఈ మేరకు అనుబంధ పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది. 2025లో జరగనున్న బోర్డు పరీక్షా కేంద్రాల్లో నిఘా కెమెరాలు తప్పనిసరి చేసినట్లు అందులో పేర్కొంది. ఈవిషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. 2025లో సీబీఎస్‌ఈ నిర్వహించే పరీక్షల్లో భారత్‌తో పాటు 26 దేశాల్లో కలిపి సుమారు 44 లక్షల మంది హాజరవుతారని బోర్డు అంచనా వేసింది. ఈమేరకు పెద్దఎత్తున వసతి కల్పించాలని సుమారు 8,000 పాఠశాలల్ని పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసింది.
వాటిలో సీసీటీవీ నిఘాని తప్పనిసరి చేస్తూ ఆయా పాఠశాలలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీసీటీవీ సౌకర్యం లేని ఏ పాఠశాలను పరీక్షా కేంద్రంగా పరిగణించేది లేదని అందులో స్పష్టంచేసింది. రికార్డ్ ఫుటేజీ సంబంధిత అధికారులు మాత్రమే చూసేందుకు వీలుంటుందని పరీక్షా ఫలితాలు వచ్చిన రెండు నెలల వరకు ఈ ఫుటేజీ భద్రంగా ఉంటుందని పేర్కొంది. ప్రతీ పది గదులకు లేదా 240 మంది విద్యార్థుల బాధ్యత తీసుకొనేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమిస్తున్నట్లు తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన సీసీటీవీ విధానం ద్వారా పారదర్శకత, పర్యవేక్షణ సామర్థ్యాలు పెరుగుతాయని సీబీఎస్‌ఈ భావిస్తోంది. వీటి సాయంతో ఎటుంటి ఆటంకం లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments