top of page
Writer's pictureAP Teachers TV

మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు #diabetes #Gymnema_sylvestre #gurmar

మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు #diabetes #Gymnema_sylvestre #gurmar

బిహార్‌లోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై అనేకరకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో గుర్మార్‌ అనే మొక్క కూడా ఉంది. మధుమేహాన్ని తగ్గించే లక్షణం దీనికి సొంతం.




బిహార్‌లోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై అనేకరకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో గుర్మార్‌ అనే మొక్క కూడా ఉంది. మధుమేహాన్ని తగ్గించే లక్షణం దీనికి సొంతం. ఈ వ్యాధి చికిత్స కోసం బీజీఆర్‌-34 అనే ఔషధ తయారీకి శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) పరిశోధకులు గుర్మార్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో జిమ్నెమిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుంది. తద్వారా తీపి పదార్థాలను తినాలన్న ఆకాంక్షను తగ్గించేస్తుంది.



ఇది అంతిమంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రహ్మయొని పర్వతంపై పిథెసెలోబియం డుల్సే, జిజుఫస్‌ జుజుబా వంటి మొక్కలు కూడా కనిపించాయి. వీటిలోని ఔషధ గుణాలపై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పర్వతంపై కనిపించిన వనమూలికలు అంతరించిపోకుండా.. స్థానికుల సాయంతో వాటిని సాగు చేయించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చికిత్సల కోసం ఆ ప్రాంతవాసులు ఉపయోగించే మొక్కలను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని భావిస్తున్నారు.




0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comentários


bottom of page