నీరసం ఇలా దూరం చేసుకోండి.
అదే పనిగా నీరసం వేధిస్తుంటే మన ఆహార, జీవనశైలులను పరిశీలించుకుని తగిన మార్పులు చేసుకోవాలి. నీరసాన్ని తగ్గించుకోవడం కోసం ఈ కింది అంశాలను గమనించుకోవాలి.
అదే పనిగా నీరసం వేధిస్తుంటే మన ఆహార, జీవనశైలులను పరిశీలించుకుని తగిన మార్పులు చేసుకోవాలి. నీరసాన్ని తగ్గించుకోవడం కోసం ఈ కింది అంశాలను గమనించుకోవాలి.
ఆహారం ఇలా: శక్తిని అందించే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం అరటిపండ్లు, బ్రౌన్ రైస్, చేపలు, చిలగడ దుంపలు, గుడ్లు, ఓట్స్, క్వినోవా, అవకాడోలను ఆహారంలో చేర్చుకోవాలి.
వ్యాయామం: వ్యాయామంతో శరీరం, మనసు చలాకీగా మారతాయి. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.
చక్కెర: చక్కెర శారీరక శక్తిని హరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతూ, తరుగుతూ ఉంటే, నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాగే ప్రాసెస్‌డ్ పదార్థాలను తినడం మానేయాలి. పాలిష్ పట్టని బియ్యం, గోధుమలను తీసుకోవాలి.
ప్రొటీన్: ప్రొటీన్ అధికంగా పదార్థాలను స్నాక్స్‌గా తీసుకోవాలి. ఇందుకోసం యాపిల్, పీనట్ బటర్, ఉడకబెట్టిన గుడ్లు, పాప్‌కార్న్, వేయించిన శనగలు తినాలి.
విశ్రాంతి: అలసటగా అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం అవసరం. శరీరానికి సరిపడా విశ్రాంతి దక్కకపోయినా, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి.
విటమిన్ డి: విటమిన్ డి లోపం కూడా నిస్సత్తువకు కారణమే! కాబట్టి వైద్యుల సలహా మేరకు డి విటమిన్ లోపాన్ని పరీక్షించుకుని సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి. అలాగే, ఉదయం, సాయంకాలపు నీరెండలో కనీసం 15 నిమిషాల పాటైనా గడుపుతూ ఉండాలి.
సంగీతం: శ్రావ్యమైన సంగీతంలో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని చలాకీగా ఉంచడానికి తోడ్పడతాయి. కాబట్టి రోజులో కొంత సేపు నచ్చిన సంగీతం వినాలి.
చల్ల నీళ్ల స్నానం: చల్లదనం కండరాలను బలపరుస్తుంది. మెటబాలిజంను పెంచుతుంది. కాబట్టి చల్లనీటితో స్నానం చేస్తూ ఉండాలి.
నవ్వడం: నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే నిస్సత్తువ కూడా దూరమవుతుంది. అందుకోసం స్నేహితులతో సరదా సమయం గడపడం, పిల్లలతో ఆడుకోవడం, కామెడీ సినిమాలు, షోలు చూడడం చేయాలి.
నీళ్లు: సరిపడా నీళ్లు తాగకపోయినా నిస్సత్తువ వేధిస్తుంది. కాబట్టి రోజులో రెండు నుంచి మూడు లీటర్లకు సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.
కాఫీ: పరిమితంగా కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాఫీలోని కెఫీన్ శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.
వాసనలు: పెప్పర్‌మింట్, దాల్చిన చెక్క, నిమ్మ, రోజ్‌మేరీ ఎసెన్షియల్ నూనెలను డిఫ్యూజర్‌లో వేసి వాసనలు పీల్చడం వల్ల ఫలితం ఉంటుంది.
నిద్ర: 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. నిద్రలేమి బడలికను కలిగిస్తుంది.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
留言