top of page
Writer's pictureAP Teachers TV

తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్‌

ప్రపంచంలోనే అతి పురాతనమైన క్యాలెండర్‌ దక్షిణ తుర్కియేలో లభ్యమైంది. తుర్కియేలోని గోబెక్లి టేపే వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ఒక భారీ రాతి స్తంభం బయటపడింది.



ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అతి పురాతనమైన క్యాలెండర్‌ దక్షిణ తుర్కియేలో లభ్యమైంది. తుర్కియేలోని గోబెక్లి టేపే వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ఒక భారీ రాతి స్తంభం బయటపడింది. దానిపై సూర్యచంద్రులకు సంబంధించిన గుర్తులు, మరికొన్ని ఇతర చిహ్నాలను గుర్తించారు. కాగా ఆ ఆలయం 13,000 ఏళ్ల నాటిదని, రాతి స్తంభంపై ఉన్న గుర్తులు అప్పటి సూర్యచంద్రుల కాలాలకు సంబంధించినవని పేర్కొన్నారు.



ఇటువంటి చిహ్నాలను సుమారు 10,850 బి.సి.లో చెక్కి ఉంటారని భావిస్తున్నారు. అప్పట్లో దీనిని ఓ క్యాలెండర్‌గా ఉపయోగించి ఉండొచ్చన్నారు. ఈ స్తంభంపై 365 జు ఆకారపు చిహ్నాలు చెక్కి ఉన్నాయని, అందులోని ఒక్కో జు ఒక్కో రోజును సూచిస్తోందని పేర్కొన్నారు. ఇందులో 12 చంద్ర నెలలు అదనంగా 11రోజులు ఉన్నట్లు వివరించారు. అంతే కాకుండా ఓ పక్షిలాంటి ఆకారం చెక్కి దాని చూట్టూ ఒకే విధమైన జు ఆకారపు చిహ్నాలు రూపొందించారని ఇవి అప్పటి కాలాలను సూచిస్తున్నాయని వెల్లడించారు. 



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page