top of page

ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక!

Writer's picture: AP Teachers TVAP Teachers TV

Updated: Aug 25, 2024

పెళ్లికార్డు ఇవ్వగానే ‘ఎప్పుడు పెళ్లి, ముహూర్తం ఎన్నింటికి’ అని అడుగుతారు... అవునా? కానీ ఈమె పెళ్లిపత్రిక చూసినవారంతా ‘మాకెన్ని మార్కులు’ అనడుగుతారు.


పెళ్లికార్డు ఇవ్వగానే ‘ఎప్పుడు పెళ్లి, ముహూర్తం ఎన్నింటికి’ అని అడుగుతారు... అవునా? కానీ ఈమె పెళ్లిపత్రిక చూసినవారంతా ‘మాకెన్ని మార్కులు’ అనడుగుతారు. అదేంటి అంటే...

పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన ప్రత్యూష అధ్యాపకురాలు. ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. అక్కడే పరిచయమైన ఫణీంద్రతో ఆమె వివాహం నిశ్చయమైంది. విద్యార్థుల భవిష్యత్తును, వారిలోని సృజనాత్మకతను తీర్చిదిద్దే పంతులమ్మ కదా! తన పెళ్లికార్డు విషయంలోనూ కాస్త సృజనాత్మకత జోడించాలనుకున్నారు. అది తన వృత్తికి సంబంధించినది అయితే బాగుంటుందని భావించిన ఆవిడ పెళ్లి వివరాలతో ఓ ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. దానిలో ప్రశ్న- సమాధానం, స్పెల్లింగ్‌ సరిచేయడం, బహుళైచ్ఛిక ప్రశ్న, తప్పు-ఒప్పు... ఇలా భిన్నవిధానాల్లో 8 ప్రశ్నలను సమాధానాలతో సహా సిద్ధం చేశారు. వరుడు, వధువు, కన్యాదానం చేసే వారి పేర్లు, పెళ్లి తేదీ, ముహూర్తం, వేదిక, విందుకు సంబంధించిన వివరాలన్నీ ఆ ప్రశ్న-జవాబుల్లోనే వచ్చేలా చేసి, ముద్రణ చేయించారు. దాన్ని చూసిన బంధువులంతా మొదట ఆశ్చర్యపోయినా... ఆమె ఆలోచనను మెచ్చుకుంటున్నారు. ఈ పెళ్లికార్డుకు ‘అధ్యాపకురాలి ఆలోచన... అద్భుతం’ అంటూ ఆన్‌లైన్‌లోనూ ప్రశంసలొస్తున్నాయి.


ఇవి కూడా చదవండి :


ఏపీ టీచర్స్ టివి:


 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page