top of page
Writer's pictureAP Teachers TV

ఆర్బీఐ క్విజ్‌.. రూ.10 లక్షలు బహుమతి

Updated: Aug 25

ఆర్బీఐ క్విజ్‌.. రూ.10 లక్షలు బహుమతి


భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహిస్తోంది. ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తం‍గా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కళాశాల విద్యార్థులకు ‘ఆర్బీఐ90క్విజ్‌’ పేరుతో ఈ పోటీలు ప్రారంభించింది.


విద్యార్థులలో రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన పెంపొందించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు నాలుగు దశల్లో ఉంటాయి. మొదట ఆన్‌లైన్‌లో దశతో ప్రారంభమై స్టేట్‌, జోనల్‌, ఫైనల్‌ దశల్లో పోటీలు జరుగుతాయి. జనరల్‌ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఈ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైంది. క్విజ్‌ సెప్టెంబర్‌లో జరుగుతుంది.



ఇక ప్రైజ్‌ మనీ విషయానికి వస్తే.. స్టేట్‌ లెవెల్‌లో మొదటి బహుమతి రూ.2లక్షలు, రెండో ప్రైజ్‌ రూ.1.5 లక్షలు, మూడో బహుమతి రూ.1లక్ష ఉంటుంది. అదే జోనల్‌ స్థాయిలో వరుసగా రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలు చొప్పున బహుమతులు ఉంటాయి. జాతీయ స్థాయిలో జరిగే ఫైనల్‌ రౌండ్‌లో విజేతలకు మొదటి బహుమతి రూ.10 లక్షలు, రెండో ప్రైజ్‌ రూ.8లక్షలు, మూడో బహుమతి కింద రూ.6 లక్షలు అందజేస్తారు.

ఇవి కూడా చదవండి :


0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page